Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #51 Translated in Telugu

قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُنْ فَيَكُونُ
ఆమె (మర్యమ్) ఇలా అన్నది: ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : `అయిపో!` అని అంటాడు, అంతే అది అయిపోతుంది
وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنْجِيلَ
మరియు ఆయన (అల్లాహ్) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతును మరియు ఇంజీలును నేర్పుతాడు
وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُمْ بِآيَةٍ مِنْ رَبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُمْ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنْفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّهِ ۖ وَأُنَبِّئُكُمْ بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
మరియు అతనిని ఇస్రాయీల్ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్) తీసుకొని వచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్ఠురోగిని బాగు చేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్) ఉంది
وَمُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُمْ بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُمْ بِآيَةٍ مِنْ رَبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను). మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము

Choose other languages: