Quran Apps in many lanuages:

Surah Ad-Dhuha Translated in Telugu

وَالضُّحَىٰ
ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా
وَاللَّيْلِ إِذَا سَجَىٰ
మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు
وَلَلْآخِرَةُ خَيْرٌ لَكَ مِنَ الْأُولَىٰ
మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది
وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా
وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా
فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు
وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ
మరియు యాచకుణ్ణి కసరుకోకు
Load More