Quran Apps in many lanuages:

Surah Al-Adiyat Translated in Telugu

وَالْعَادِيَاتِ ضَبْحًا
వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా
فَالْمُورِيَاتِ قَدْحًا
తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి
فَالْمُغِيرَاتِ صُبْحًا
తెల్లవారుఝామున దాడి చేసేవాటి
فَأَثَرْنَ بِهِ نَقْعًا
(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ
فَوَسَطْنَ بِهِ جَمْعًا
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి
إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు
أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు
Load More