Surah Al-Anaam Translated in Telugu
الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ
ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు
هُوَ الَّذِي خَلَقَكُمْ مِنْ طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُسَمًّى عِنْدَهُ ۖ ثُمَّ أَنْتُمْ تَمْتَرُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు
وَهُوَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ
మరియు ఆయన! అల్లాహ్ యే, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు
وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ
అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు
فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنْبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్య గ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు పరిహసించే దాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది
أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنْ قَرْنٍ مَكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِمْ مِدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِنْ تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُمْ بِذُنُوبِهِمْ وَأَنْشَأْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా?) వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదలనిచ్చి వారిని భువిలో స్థిర పరిచాము; మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాలు కురిపించాము; మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము; చివరకు వారు చేసిన పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము; మరియు వారి స్థానంలో ఇతర తరాల వారిని లేపాము
وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్యతిరస్కారులు: ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!" అని అనేవారు
وَقَالُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنْزَلْنَا مَلَكًا لَقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنْظَرُونَ
మరియు వారు: ఇతని వద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింప బడ లేదు?" అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపి ఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది. కాదు
وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِمْ مَا يَلْبِسُونَ
మరియు ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా, అతనిని మేము మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారం. మరియు వారు ఇపుడు ఏ సంశయంలో పడి ఉన్నారో! వారిని ఆ సంశయానికే గురి చేసి ఉండేవారం
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున పరిహసించే వారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది
Load More