Surah Al-Ankabut Translated in Telugu

أَحَسِبَ النَّاسُ أَنْ يُتْرَكُوا أَنْ يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ

ఏమీ? : ప్రజలు మేము విశ్వసించాము!" అని అన్నంత మాత్రాన్నే తాము విడిచి పెట్ట బడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా
وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ

మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లాహ్ వ్యక్తపరుస్తాడు
أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَنْ يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ

లేక, చెడుపనులు చేస్తున్నవారు, మా (శిక్ష) నుండి తప్పించుకోగలరని భావిస్తున్నారా? ఎంత చెడ్డ నిర్ణయం వారిది
مَنْ كَانَ يَرْجُو لِقَاءَ اللَّهِ فَإِنَّ أَجَلَ اللَّهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ

అల్లాహ్ ను కలుసుకునే కోరిక ఉన్నవాడు, అల్లాహ్ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు
وَمَنْ جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ

కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము
وَوَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِنْ جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు. మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము
وَمِنَ النَّاسِ مَنْ يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِنْ جَاءَ نَصْرٌ مِنْ رَبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ

మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి
Load More