Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #11 Translated in Telugu

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా అలాంటి వారి (పూర్వపు) పాపాలను మేము తప్పక తొలగిస్తాము మరియు వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమమైన ప్రతిఫలం ఇస్తాము
وَوَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِنْ جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాము. కాని వారిద్దరూ, నీవు ఎరుగని వానిని నాకు భాగస్వామిగా చేయమని బలవంతపెడితే, నీవు వారి ఆజ్ఞాపాలన చేయకు. మీరందరూ నా వైపుకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు నేను మీకు, మీరు ఏమి చేస్తూ ఉండేవారో తెలుపుతాను
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, మేము వారిని తప్పక సద్వర్తనులతో చేర్చుతాము
وَمِنَ النَّاسِ مَنْ يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِنْ جَاءَ نَصْرٌ مِنْ رَبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ
మరియు ప్రజలలో కొందరు (తమ నాలుకలతో): మేము అల్లాహ్ ను విశ్వసించాము." అని అనే వ్యక్తులున్నారు. కాని వారు అల్లాహ్ మార్గంలో హింసించపడినప్పుడు, మానవులు పెట్టిన పరీక్షలను అల్లాహ్ యొక్క శిక్షగా భావిస్తారు; మరియు ఒకవేళ నీ ప్రభువు నుండి సహాయం వస్తే వారు (కపట విశ్వాసులు) అంటారు: నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. సర్వలోకాల వారి హృదయాల స్థితి అల్లాహ్ కు తెలియదా ఏమిటి
وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ
మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వసించిన వారిని స్పష్టపరుస్తాడు మరియు ఆయన కపట విశ్వాసులను కూడా స్పష్టపరుస్తాడు

Choose other languages: