Surah Al-Araf Translated in Telugu

كِتَابٌ أُنْزِلَ إِلَيْكَ فَلَا يَكُنْ فِي صَدْرِكَ حَرَجٌ مِنْهُ لِتُنْذِرَ بِهِ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ

(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం
اتَّبِعُوا مَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِنْ دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَا تَذَكَّرُونَ

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు
وَكَمْ مِنْ قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష (ఆకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది
فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُمْ بَأْسُنَا إِلَّا أَنْ قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది
فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ

కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా, ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము
فَلَنَقُصَّنَّ عَلَيْهِمْ بِعِلْمٍ ۖ وَمَا كُنَّا غَائِبِينَ

అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము
وَالْوَزْنُ يَوْمَئِذٍ الْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు
وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ بِمَا كَانُوا بِآيَاتِنَا يَظْلِمُونَ

మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు
وَلَقَدْ مَكَّنَّاكُمْ فِي الْأَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ ۗ قَلِيلًا مَا تَشْكُرُونَ

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ
Load More