Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #100 Translated in Telugu

وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَنْ يُعَمَّرَ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
మరియు నిశ్చయంగా, జీవితం పట్ల సర్వజనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి (యూదుల)లోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులను కూడా మించి పోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వేయి సంవత్సరాలు బ్రతకాలని కోరుతుంటాడు. కానీ దీర్ఘాయుర్ధాయం వారిని శిక్ష నుండి తప్పించలేదు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు
قُلْ مَنْ كَانَ عَدُوًّا لِجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّهِ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని దివ్యగ్రంథాలను ఇది ధృవీకరిస్తున్నది మరియు విశ్వసించే వారికి ఇది సన్మారం చూపుతున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది
مَنْ كَانَ عَدُوًّا لِلَّهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّهَ عَدُوٌّ لِلْكَافِرِينَ
అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు
وَلَقَدْ أَنْزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ
మరియు వాస్తవంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయత్) అవతరింపజేశాము. మరియు అవిదేయులుతప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు
أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَبَذَهُ فَرِيقٌ مِنْهُمْ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ
ఏమీ? వారు ఒడంబడిక చేసినపుడల్లా, వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసి పుచ్చుటం జరగలేదా? వాస్తవానికి వారిలో చాలా మంది విశ్వసించని వారున్నారు

Choose other languages: