Surah Al-Bayyina Translated in Telugu

لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنْفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ

ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు
رَسُولٌ مِنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُطَهَّرَةً

అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు, వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు
وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ

మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు
وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

మరియు వారికిచ్చిన ఆదేశం: వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము
إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు
إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు
جَزَاؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ

వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం