Surah Al-Fath Translated in Telugu

إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُبِينًا

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము
لِيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُسْتَقِيمًا

అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి
هُوَ الَّذِي أَنْزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు
لِيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِنْدَ اللَّهِ فَوْزًا عَظِيمًا

విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్ దృష్టిలో ఇది ఒక గొప్ప విజయం
وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

మరియు కపట విశ్వాసులు (మునాఫిఖీన్) అయిన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను; మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను; అల్లాహ్ ను గురించి చెడు భావనలు, భావించే వారందరినీ శిక్షించేందుకు. వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకు పడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు (బహిష్కరించాడు); మరియు వారి కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం
وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا

ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا

నిశ్చయంగా, (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసే వానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపాము
لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడాలనీ
إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَنْ نَكَثَ فَإِنَّمَا يَنْكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయి వేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్ తో శపథం చేస్తున్నారు. అల్లాహ్ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగం చేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు
Load More