Quran Apps in many lanuages:

Surah Al-Hadid Translated in Telugu

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్తం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు
لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయనే జీవన మిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు
هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు
هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنْتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతో పాటు ఉంటాడు మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు
لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆకాశాలపై మరియు భూమిపై స్రామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి
يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తాడు. మరియు ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు
آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَأَنْفِقُوا مِمَّا جَعَلَكُمْ مُسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنْكُمْ وَأَنْفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసిన వాటి నుండి (దానంగా) ఖర్చు పెట్టిండి. మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని (దానముగా) ఖర్చు చేస్తారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది
وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
మరియు మీకేమయింది? మీరు (వాస్తవానికి) విశ్వాసులే అయితే? మీరెందుకు అల్లాహ్ ను విశ్వసించరు? మరియు ప్రవక్త, మిమ్మల్ని మీ ప్రభువును విశ్వసించండని పిలుస్తున్నాడు మరియు వాస్తవానికి మీచేత ప్రమాణం కూడా చేయించు కున్నాడు
هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِيُخْرِجَكُمْ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَحِيمٌ
తన దాసుని (ముహమ్మద్)పై స్పష్టమైన ఆయాత్ (సూచనలు) అవతరింప జేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత
وَمَا لَكُمْ أَلَّا تُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنْكُمْ مَنْ أَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذِينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. (మక్కా) విజయానికి ముందు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, (మక్కా విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చుపెట్టినవారు) సమానులు కాజాలరు! అలాంటి వారి స్థానం (విజయం తరువాత అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారి కంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్ ఉత్తమమైన (ప్రతిఫలం) వాగ్దానం చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
Load More