Surah Al-Isra Translated in Telugu

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు
وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِنْ دُونِي وَكِيلًا

మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు
ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا

మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు
وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا

మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు
فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَفْعُولًا

ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది
ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا

ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము
إِنْ أَحْسَنْتُمْ أَحْسَنْتُمْ لِأَنْفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا

(మరియు మేము అన్నాము): ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు. మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే!" పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను (మిమ్మల్ని) అవమాన పరచటానికి, మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు, మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతి దానిని నాశనం చేయటానికి (మీ శత్రువులను మీపైకి పంపాము)
عَسَىٰ رَبُّكُمْ أَنْ يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدْتُمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا

(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము
إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది
وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا

మరియు నిశ్చయంగా, పరలోకాన్ని విశ్వసించిన వారికి మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచామని (తెలియజేస్తుంది)
Load More