Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #88 Translated in Telugu

قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا
వారితో ఇలా అను: ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు
وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُمْ مِنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది
وَلَئِنْ شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا
మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) లాగుకోగలము. (స్వాధీన పరచుకోగలము). అప్పుడు దానిని గురించి, మాకు వ్యతిరేకంగా, నీవు ఏ సహాయకుడినీ పొందలేవు
إِلَّا رَحْمَةً مِنْ رَبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا
కేవలం నీ ప్రభువు కారుణ్యం తప్ప! నిశ్చయంగా, నీపై ఉన్న ఆయన (నీ ప్రభువు) అనుగ్రహం ఎంతో గొప్పది
قُلْ لَئِنِ اجْتَمَعَتِ الْإِنْسُ وَالْجِنُّ عَلَىٰ أَنْ يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا
ఇలా అను: ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు

Choose other languages: