Surah Al-Jinn Translated in Telugu

قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا

(ఓ ప్రవక్తా!) ఇలా అను: నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: `వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము
يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَنْ نُشْرِكَ بِرَبِّنَا أَحَدًا

అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము. మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا

మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్యగా (సాహిబతున్ గా) గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు
وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا

మరియు నిశ్చయంగా, మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు
وَأَنَّا ظَنَنَّا أَنْ لَنْ تَقُولَ الْإِنْسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا

మరియు వాస్తవానికి మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్ ను గురించి అబద్ధం పలకరని భావించేవారము
وَأَنَّهُ كَانَ رِجَالٌ مِنَ الْإِنْسِ يَعُوذُونَ بِرِجَالٍ مِنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنْتُمْ أَنْ لَنْ يَبْعَثَ اللَّهُ أَحَدًا

మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు
وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا

మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము
وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَنْ يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَصَدًا

మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం. కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది
وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَنْ فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا

మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు
Load More