Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayah #5 Translated in Telugu

الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَنْ يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు

Choose other languages: