Quran Apps in many lanuages:

Surah Al-Mumenoon Translated in Telugu

قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ
వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు
الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో
وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో
وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో
وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో
إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు
فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు
وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో
وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో
أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు
Load More