Surah Al-Muzzammil Translated in Telugu

أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا

లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు
إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا

నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము
إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا

నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది
وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا

మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు
رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا

ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا

మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో
Load More