Surah An-Nahl Translated in Telugu
أَتَىٰ أَمْرُ اللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు
يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنْذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ
ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు, వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి
خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు
خَلَقَ الْإِنْسَانَ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ
ఆయన మానవుణ్ణి ఇంద్రియ (వీర్య) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు
وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ
మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు
وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ
మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది
وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنْفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَحِيمٌ
మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత
وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ
మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు
وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు
هُوَ الَّذِي أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَكُمْ مِنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ
ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది
Load More