Surah An-Naml Translated in Telugu

طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُبِينٍ

తా-సీన్. ఇవి దివ్యఖుర్ఆన్ ఆయతులు మరియు ఇది ఒక స్పష్టమైన గ్రంథము
هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ

ఇవి విశ్వాసులకు మార్గదర్శకత్వం గానూ మరియు శుభవార్తలు ఇచ్చేవి గానూ ఉన్నాయి
الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ

ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో మరియు విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితాన్ని నమ్ముతారో
إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ

నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో, వారికి మేము వారి చేష్టను ఆకర్షణీయమైనవిగా చేశాము. అందువల్ల వారు అంధుల వలే దారి తప్పి తిరుగుతూ ఉంటారు
أُولَٰئِكَ الَّذِينَ لَهُمْ سُوءُ الْعَذَابِ وَهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ

ఇలాంటి వారికి చెడ్డ శిక్ష ఉంది. మరియు చివరకు వారే అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు
وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِنْ لَدُنْ حَكِيمٍ عَلِيمٍ

మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్ఆన్ ను మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన (అల్లాహ్) నుండి పొందుతున్నావు
إِذْ قَالَ مُوسَىٰ لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُمْ مِنْهَا بِخَبَرٍ أَوْ آتِيكُمْ بِشِهَابٍ قَبَسٍ لَعَلَّكُمْ تَصْطَلُونَ

(జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది. నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకు వస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను." అని అన్నాడు
فَلَمَّا جَاءَهَا نُودِيَ أَنْ بُورِكَ مَنْ فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَالَمِينَ

కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: ఈ అగ్నిలో ఉన్న వానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు
يَا مُوسَىٰ إِنَّهُ أَنَا اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ

ఓ మూసా! నిశ్చయంగా ఆయన అల్లాహ్ ను నేనే! సర్వశక్తిమంతుడను, మహా వివేకవంతుడను
وَأَلْقِ عَصَاكَ ۚ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ

నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. (అల్లాహ్ అన్నాడు): ఓ మూసా! భయపడకు. నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు
Load More