Surah Ar-Rad Translated in Telugu
المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ الْحَقُّ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
అలిఫ్ - లామ్ - మీమ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యం! అయినా చాలా మంది, విశ్వసించటం లేదు
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُمْ بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ
మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువున కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని
وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِنْ كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి
وَفِي الْأَرْضِ قِطَعٌ مُتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَعْقِلُونَ
మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒకదాని కొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్షతోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటి గానూ, మరికొన్ని గుచ్చలు - గుచ్చలు (జతలు) గానూ ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొకదాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా వీటన్నింటిలో అర్థం చేసుకో గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి
وَإِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?" అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటి వారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి. మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు
وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ
మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందరపెడుతున్నారు. మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ! నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు
وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ آيَةٌ مِنْ رَبِّهِ ۗ إِنَّمَا أَنْتَ مُنْذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ
మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు
اللَّهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنْثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِنْدَهُ بِمِقْدَارٍ
అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది
عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ
ఆయన అగోచర మరియు గోచర విషయాన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, సర్వోన్నతుడు
سَوَاءٌ مِنْكُمْ مَنْ أَسَرَّ الْقَوْلَ وَمَنْ جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ
మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)
Load More