Quran Apps in many lanuages:

Surah Ar-Rum Ayahs #6 Translated in Telugu

غُلِبَتِ الرُّومُ
రోమన్ లు పరాజితులయ్యారు
فِي أَدْنَى الْأَرْضِ وَهُمْ مِنْ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు
فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِنْ قَبْلُ وَمِنْ بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ
(రాబోయే) కొన్ని సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు
بِنَصْرِ اللَّهِ ۚ يَنْصُرُ مَنْ يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత
وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు

Choose other languages: