Surah At-Tawba Translated in Telugu
بَرَاءَةٌ مِنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدْتُمْ مِنَ الْمُشْرِكِينَ

అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది
فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۙ وَأَنَّ اللَّهَ مُخْزِي الْكَافِرِينَ

కావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి. కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు
وَأَذَانٌ مِنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِنْ تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَكُمْ ۖ وَإِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ

మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్జ్ రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవారాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే, మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి." మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు
إِلَّا الَّذِينَ عَاهَدْتُمْ مِنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنْقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ

కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు
فَإِذَا انْسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ

ఇక నిషిద్ధమాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَإِنْ أَحَدٌ مِنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَعْلَمُونَ

మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు
كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِنْدَ اللَّهِ وَعِنْدَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدْتُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు
كَيْفَ وَإِنْ يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُمْ بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ

(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు
اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَنْ سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ

వారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి
لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ

వారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు
Load More