Surah Az-Zalzala Translated in Telugu
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ
ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు
فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు
وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు