Quran Apps in many lanuages:

Surah Az-Zukhruf Ayahs #63 Translated in Telugu

إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِبَنِي إِسْرَائِيلَ
అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము
وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنْكُمْ مَلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ
మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము
وَإِنَّهُ لَعِلْمٌ لِلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం
وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
మరియు షైతాన్ ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు
وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُمْ بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُمْ بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను; మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి

Choose other languages: