Surah Ibrahim Translated in Telugu

الر ۚ كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ

ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది
الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ

ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు
وَمَا أَرْسَلْنَا مِنْ رَسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి, మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُمْ بِأَيَّامِ اللَّهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ

మరియు వాస్తవానికి మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) పంపి: నీ జాతి వారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి, వారికి అల్లాహ్ దినాలను జ్ఞాపకం చేయించు." అని అన్నాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలురకు, కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُمْ بَلَاءٌ مِنْ رَبِّكُمْ عَظِيمٌ

మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిర్ఔన్ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు, మీ కుమారులను వధించి, మీ కుమార్తెలను (స్త్రీలను) బ్రతకనిచ్చేవారు. మరియు అందులో మీకు, మీ ప్రభువు తరపు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది
وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ

మరియు మీ ప్రభువు ప్రకటించింది (జ్ఞాపకం చేసుకోండి): మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. కాని ఒకవేళ మీరు కృతఘ్నులైతే! నిశ్చయంగా, నా శిక్ష ఎంతో కఠినమైనది
وَقَالَ مُوسَىٰ إِنْ تَكْفُرُوا أَنْتُمْ وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ

మరియు మూసా ఇలా అన్నాడు: ఒకవేళ మీరు మరియు భూమిలో నున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే! తెలుసుకోండి నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు
أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِنْ بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُمْ بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ

ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు, వారు తమ నోళ్ళలో తమ చేతులు పెట్టుకొని ఇలా అన్నారు: నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి వున్నాము
قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ۚ قَالُوا إِنْ أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا تُرِيدُونَ أَنْ تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُبِينٍ

వారి ప్రవక్తలు (వారితో) ఇలా అన్నారు: ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన, అల్లాహ్ ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీత కాలం వరకు వ్యవధి నివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు!" వారన్నారు: మీరు కూడా మా వంటి మానవులే, మీరు మా తండ్రితాతలు ఆరాధిస్తూ వచ్చిన (దైవాల) ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి
Load More