Quran Apps in many lanuages:

Surah Muhammad Translated in Telugu

الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ
ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్) నిష్ఫలం చేశాడు
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِنْ رَبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ - ముహమ్మద్ మీద అవతరింప జేయబడిన దానిని - తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచి వేశాడు మరియు వారి స్థితిని బాగు పరిచాడు
ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు
فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنْتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّهُ لَانْتَصَرَ مِنْهُمْ وَلَٰكِنْ لِيَبْلُوَ بَعْضَكُمْ بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ فَلَنْ يُضِلَّ أَعْمَالَهُمْ
కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు, వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి, లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు
سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ
ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు
وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ
మరియు వారికి తెలియజేసి యున్న, స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنْ تَنْصُرُوا اللَّهَ يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ
ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు
وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ
ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు
ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను విఫలం చేశాడు
أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది
Load More