Surah Sad Translated in Telugu

بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ

వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు
كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنْ قَرْنٍ فَنَادَوْا وَلَاتَ حِينَ مَنَاصٍ

వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది
وَعَجِبُوا أَنْ جَاءَهُمْ مُنْذِرٌ مِنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَٰذَا سَاحِرٌ كَذَّابٌ

మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: ఇతడు మాంత్రికుడు, అసత్యవాది
أَجَعَلَ الْآلِهَةَ إِلَٰهًا وَاحِدًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عُجَابٌ

ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం
وَانْطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ يُرَادُ

మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది
مَا سَمِعْنَا بِهَٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَٰذَا إِلَّا اخْتِلَاقٌ

ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే
أَأُنْزِلَ عَلَيْهِ الذِّكْرُ مِنْ بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِنْ ذِكْرِي ۖ بَلْ لَمَّا يَذُوقُوا عَذَابِ

ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు
أَمْ عِنْدَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ

లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా
أَمْ لَهُمْ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ

లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను
Load More