Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #44 Translated in Telugu

مَا تَعْبُدُونَ مِنْ دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا أَنْزَلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు కల్పించుకున్న - పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింప జేయలేదు. నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలా మందికి ఇది తెలియదు
يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا ۖ وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِنْ رَأْسِهِ ۚ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! మీలో ఒకడు తన యజమానికి మద్యపానం (సారాయి) త్రాగిస్తూ ఉంటాడు. ఇక రెండవ వాడు సిలువపై ఎక్కించబడతాడు మరియు అతని నెత్తిపై నుండి పక్షులు తింటూ ఉంటాయి. మీరు అడుగుతున్న (కలల) విషయం గురించి ఈ విధమైన తీర్పు ఇవ్వబడుతోంది
وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُ نَاجٍ مِنْهُمَا اذْكُرْنِي عِنْدَ رَبِّكَ فَأَنْسَاهُ الشَّيْطَانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنِينَ
మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి." కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షైతాన్ మరపింప జేశాడు, కావున (యూసుఫ్) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు
وَقَالَ الْمَلِكُ إِنِّي أَرَىٰ سَبْعَ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعَ سُنْبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ ۖ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي رُؤْيَايَ إِنْ كُنْتُمْ لِلرُّؤْيَا تَعْبُرُونَ
(ఒకరోజు) రాజు అన్నాడు: వాస్తవానికి నేను (కలలో) ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన (ఆవులు) తిని వేస్తున్నట్లు మరియు ఏడు పచ్చి వెన్నులను మరొక ఏడు ఎండిపోయిన వాటిని చూశాను. ఓ సభాసదులారా! మీకు స్వప్నాల భావం తెలిస్తే నా స్వప్నాల భావాన్ని తెలుపండి
قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ ۖ وَمَا نَحْنُ بِتَأْوِيلِ الْأَحْلَامِ بِعَالِمِينَ
వారన్నారు: ఇవి పీడకలలు. మరియు మాకు కలల గూఢర్థం తెలుసుకునే నైపుణ్యం లేదు

Choose other languages: