Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #69 Translated in Telugu

وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ ۖ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي ۖ هَٰذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ۖ وَنَمِيرُ أَهْلَنَا وَنَحْفَظُ أَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيرٍ ۖ ذَٰلِكَ كَيْلٌ يَسِيرٌ
మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు: నాన్నా! (చూడండి) ఇంకేం కావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. మరియు మేము మన ఇంటివారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాము. ఇంకా ఒక ఒంటె మోసే బరువు (ధాన్యం) కూడా ఎక్కువగా తీసుకొని రాగలము. ఇక అంత ధాన్యం కూడా (అదనంగా) సులభంగా లభిస్తుంది కదా
قَالَ لَنْ أُرْسِلَهُ مَعَكُمْ حَتَّىٰ تُؤْتُونِ مَوْثِقًا مِنَ اللَّهِ لَتَأْتُنَّنِي بِهِ إِلَّا أَنْ يُحَاطَ بِكُمْ ۖ فَلَمَّا آتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ
(యఅఖూబ్) అన్నాడు: మీరు ముట్టడికి గురి అయితే తప్ప, అతనిని నా వద్దకు తప్పక తీసుకు రాగలమని అల్లాహ్ పేరుతో నా ముందు ప్రమాణం చేస్తేనే గానీ, నేను అతనిని మీ వెంట పంపను." వారు ప్రమాణం చేసిన తరువాత, అతను అన్నాడు: మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి
وَقَالَ يَا بَنِيَّ لَا تَدْخُلُوا مِنْ بَابٍ وَاحِدٍ وَادْخُلُوا مِنْ أَبْوَابٍ مُتَفَرِّقَةٍ ۖ وَمَا أُغْنِي عَنْكُمْ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ ۖ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَعَلَيْهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ
(ఇంకా) ఇలా అన్నాడు: ఓ నా కుమారులారా! మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. నేను మిమ్మల్ని అల్లాహ్ (సంకల్పం) నుండి ఏ విధంగానూ తప్పించలేను. అంతిమతీర్పు కేవలం అల్లాహ్ కే చెందుతుంది. నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను. మరియు ఆయనను నమ్ముకున్న వారు కేవలం ఆయన పైననే ఆధారపడి ఉంటారు
وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُمْ مَا كَانَ يُغْنِي عَنْهُمْ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِمَا عَلَّمْنَاهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం (ఆ నగరంలో వేర్వేరు ద్వారాల గుండా) ప్రవేశించారు. అది కేవలం యఅఖూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే, కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి, వారికి ఏ మాత్రమూ పనికి రాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే కాని చాలా మందికి తెలియదు
وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ
మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: వాస్తవానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు

Choose other languages: